గణేష్ నిమ్మజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని ..జిల్లా ఎస్.పి శ్రీ ఇ.జి అశోక్ కుమార్ తెలిపారు. పోలీస్ శాఖ రూపొందించిన ఉత్సవ్ యాప్ ద్వారా నమోదు చేసుకుని జిల్లా వ్యాప్తంగా 4500 కు పైగా విగ్రహాల ప్రతిష్ట చేశారన్నారు. భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు చేస్తున్నట్టు వెల్లడించారు. విగ్రహ ప్రతిష్టాపన నుండి నిమజ్జనం పూర్తయ్యే వరకూ పటిష్ట పోలీస్ శాఖ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.