సిద్దిపేట జిల్లా మద్దూరు ఏంపిడిఓ కార్యాలయాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు మండలంలోను మరియు గ్రామాల్లో పబ్లిష్ చేసిన ఓటరు జాబితా పైన అభ్యంతరాలు స్వీకరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటి వరకు 40 కి పైగా అభ్యంతరాలు వచ్చాయని వాటిని తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ పోర్టల్ లో అప్లోడ్ చేసే చేసే విధానాన్ని పరిశీలించారు.