నల్గొండ జిల్లా, దేవరకొండ పట్టణంలో సీఐ వెంకట్ రెడ్డి శనివారం సాయంత్రం పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న గోదాములను, ఫర్టిలైజర్ దుకాణాలలోని నిలువలను, ధరల పట్టికలు, రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న యూరియాను అక్రమంగా నిల్వచేసిన, అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని ఫర్టిలైజర్ దుకాణాల యజమానులను హెచ్చరించారు.