నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. సొసైటీ ముందు చెప్పులు, పాస్ బుక్కులు వరుస లైన్ లో పెట్టి రైతులు యూరియా కోసం పడి గాపులుకాశారు. యూరియా స్టాకు అయిపోవడంతో రైతులు తమకు సకాలంలో యూరియాను అందించాలని సొసైటీ సెక్రటరీతో రైతులు వాగ్వివాదానికి దిగారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వర్షాలు మళ్లీ కురవడంతో తమకు యూరియా ఎక్కువ అవసరం ఉంటదని రైతుల డిమాండ్ కు సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు.