Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 7, 2025
విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి అన్నారు. స్థానిక MPDO ఆఫీసులో మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారికి అభినందన కార్యక్రమం జరిగింది. సబ్ కలెక్టర్ విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వినూత్న విద్యా బోధన జరగాలని ఆశించారు. ఉపాధ్యాయులకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో జరిగింది.