జిల్లా పోలీస్ కార్యాలయంలో గల జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (DCRB) లో సబ్ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూన్న దత్తాద్రి ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు.ఈసందర్బంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆశోక్ కుమార్ ను సోమవారం సాయంత్రం 5-30 గంటలప్రాంతంలో మర్యాదపూర్వకంగా కలిశారు . ఈ సందర్భంగా పదోన్నతి పొందిన దత్తాద్రి ని ఎస్పీ ఆశోక్ కుమార్ అభినందించి పదోన్నతి చిహ్నంగా మరొక స్టార్ ను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలో పనిచేస్తూ ఎన్నో ఏళ్లుగా అవిశ్రాంతంగా చేస్తున్న కృషికి పదోన్నతి ఒక గొప్ప గుర్తింపు అన్నారు. పదోన్నతి అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో ఒక మైలురాయి వంటిదని ముఖ్య