అర్జీదారులు, ఫిర్యాదుదారుల పట్ల భాధ్యతాయుతంగా, సహనంతో,సానుకూల దృక్పథంలో స్పందించ గలిగినపుడే.. ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలరని,ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతా యుతంగా వారి విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లోని సభాభవన్ లో పిజిఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదుల పెండెన్సీపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. జేసీ అదితి సింగ్, డిఆర్వో విశ్వేశ్వర నాయుడు, ఎస్డీసి వెంకటపతి, జెడ్పి సీఈవో ఓబులమ్మ లతో కలిసి.. ఆయా డివిజన్ల ఆర్డీఓలు, అన్ని మండలాల తహశీల్దార్లుతో సమీక్షించారు.