ఈనెల విశాఖలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగునని మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు తెలిపారు ఆదివారం విశాఖ ఇందిరా మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాని ఉద్దేశించి మాట్లాడారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో 15000 మందిపైగా ముఖ్య కార్యకర్తలు పాల్గొంటారని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని అన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి జడ్పిటిసి ఎంపిటిసి ముఖ్య కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం ఉంటుందన్నారు