కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రజలకు సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు సైబర్ క్రైమ్ డీఎస్పీ కోత్వాల్ రమేష్ శనివారం తెలిపారు. సైబర్ మోసాలపై ప్రజలకు వివరిస్తూ ముఖ్యంగా ఆధార్ కార్డు మోసాలు,APK ఫైల్స్ , సిమ్ కార్డ్ దుర్వినియోగం, బ్యాంకు ఖాతా సమాచార దుర్వినియోగం, ఫిషింగ్ లింక్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా ఫ్రాడ్స్, పార్ట్ టైం జాబ్స్ ఫ్రాడ్స్ వంటి సైబర్ నేరాల పై అవగాహన కల్పించినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ మోసాలకు గురైతే వెంటనే 1930 కు కాల్ చేయాలని, మరియు cybercrime.gov.in వెబ్ సైట్ లో కూడా నమోదు చేయవచ్చని తెలిపారు.