గంగవరం: స్థానికులు గురువారం తెలిపిన సమాచారం మేరకు, కిట్టన్న మిషన్ వెనుక వ్యవసాయ బావిలో పడి శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. అలాగే గంగవరం పోలీసులకు సమాచారం అందించగా. ఘటనా ప్రాంతానికి చేరుకున్న వారు మృతదేహాన్ని బావి నుండి పైకి తీయడానికి అగ్నిమాపక శాఖ అధికారులను సంప్రదించారు. బావి లోతు ఎక్కువగా ఉండడం వలన మరియు చీకటి పడడంతో మృతదేహాన్ని తీయడానికి సాధ్యపడలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. శ్రీనివాస్ ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాడా లేదా మరి ఇంకేదైనా కోణం ఉందా అనేది పోలీసులు దర్యాప్తులో తెలియాల్సిఉంది.