రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజి వద్ద ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురెదురుగా ఢీ కొన్నాయి. కారు బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు స్వల్పంగా వాహనాలు దెబ్బతిన్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.