కనిగిరి మండలంలోని మందాడి వారి పల్లి గ్రామంలో సాగర్ పైప్ లైన్ పగిలిపోవడంతో సాగర్ జలాలు వృధాగా పోతున్నాయి. పైప్ లైన్ పగిలిపోయి , సాగర్ జలాలు వృధాగా పోతున్నప్పటికీ అధికారులు అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సాగర్ పైప్ లైన్ కు మరమ్మత్తులు చేపట్టి, సాగర్ మంచినీరు వృధాగా పోకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.