కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పురుమళ్ళ శ్రీనివాస్ కు రెండు ఓట్లు ఉన్నాయని ఎంపీడీవో కు సోమవారం బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. రూరల్ మండల బిజెపి అధ్యక్షుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పురుమళ్ళ శ్రీనివాస్, పురుమళ్ళ లలిత కు బొమ్మకల్ లో ఓటు హక్కు ఉండి, మరో గ్రామమైన ఇరుకుల లో కూడా ఓటు హక్కు ఉందని తెలిపారు. తప్పులతడకగా ఓటర్ లిస్ట్ ఉందని, ఓటు చోరీ చేసిందనే కాంగ్రెస్ పార్టీ దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఎంపీడీవో చర్యలు తీసుకోవాలని వినపత్రం ఇచ్చారు.