వైయస్సార్ కడప జిల్లా వ్యాప్తంగా చంద్రగ్రహణం కారణంగా పలు ఆలయాలను మూసివేశారు. అందులో భాగంగా సిద్దవటం (M) కనుమలోపల్లె సమీపంలోని శివాలయం చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మూసివేశారు.ఇక్కడ ప్రతిష్ఠింపబడిన 109 శివలింగాలు చంద్రగ్రహ ప్రభావం పడకుండా వస్త్రాలతో చుట్టేశారు. సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం, శనీశ్వరాలయం, కామాక్షి అమ్మవారు ఆలయం, విఘ్నేశ్వరుడు తదితర విగ్రహమూర్తుల ఆలయాలను మూసివేశారు. చంద్రగ్రహణ అనంతరం సంప్రోక్ష పూజలు నిర్వహించి ఆలయాలను తెరవనున్నారు.