అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ బెల్టు దుకాణంపై శుక్రవారం సాయంత్రం ఆసిఫాబాద్ పోలీసులు దాడి చేశారు. ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన గణేష్ అనే వ్యక్తి సాయిబాబా గుడి ఎదుట అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో సీఐ బాలాజీ వరప్రసాద్ పోలీస్ సిబ్బందితో కలసి దాడులు చేయగా సుమారు ఒక లక్ష విలువైన మద్యం బాటిళ్లను స్వాదీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు.