యాడికి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో వీర్రాజు మృతుడు వెంకట రాముడు కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. యాడికి మండలం ఓబులాపురంకు చెందిన వెంకటరాముడు గత ఏప్రిల్ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వెంకట రాముడు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకులో ఇన్సూరెన్స్ చేశాడు.ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు రూ.2 లక్షలు ప్రమాద బీమాను మంజూరు చేయడంతో పంపిణీ చేశారు. మృతుడు వెంకటరాముడు కుటుంబ సభ్యులు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.