ద్విచక్ర వాహనంతో కామ్రేడ్ స్థూపాన్ని ఢీ కొట్టిన ఘటనలో యువకుడికి గాయాలైన ఘటన సోమవారం బాపట్లలో చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం బాపట్లలోని కొత్త బస్టాండ్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు ఎదురుగా వస్తున్న వ్యక్తిని తప్పించబోయి కామ్రేడ్ స్థూపాన్ని ఢీ కొట్టాడు. దీంతో ఆ యువకుడికి గాయాలు ఇవ్వడంతో వైద్యశాలకు స్థానికులు తరలించారు. దీనిపైన బాపట్ల పట్టణ పోలీసులు ఆరా తీశారు.