టీఎస్ఆర్టీసీ సేవలను ప్రతి గడపకు చేర్చడమే సంస్థ లక్ష్యమని ఎండీ వీసీ సజ్జనార్ ఐపీఎస్ అన్నారు. బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి విలేజ్, కాలనీ బస్ ఆఫీసర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక బాధ్యతగా చేపట్టిన యాత్రాదానం కార్య క్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. త్వరలో అయోధ్య, వారాణాసి తదితర పుణ్యక్షేత్రాల టూర్ ప్యాకేజీలు ప్రకటిస్తామని తెలిపారు