తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ గా అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ అర్బన్ మండలానికి చెందిన 79 మంది లబ్ధిదారులకు 38 లక్షల రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ను చిన్నాభిన్నం చేసినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గత కొన్ని నెలలుగా ఎంతో క్రమశిక్షణ తోటి ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెట్టేందుకు కృషి చేసినందుకే పేద ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్త