జగిత్యాల అర్బన్ మండలం, మరియు జగిత్యాల పట్టణానికి చెందిన సిఎం సహాయ నిధి,కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన 1కోటి 64 లక్షల 82 వేల 200 విలువ గల చెక్కులను 248 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు.జగిత్యాల పట్టణ పొన్నాల గార్డెన్స్ లో శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.64 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 16 లక్షల 82 వేల 200 రూపాయల విలువగల చెక్కులను, 89 మందికి, కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ పథకం ద్వారా మంజూరైన 89 లక్షల రూపాయల విలువగల చెక్కులను