సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి(83) మరణం వామపక్ష, ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని లోటు అని *సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం* అన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం హైదరాబాదులో సురవరం సుధాకర్ రెడ్డి మృతి చెందారు. సూరవరం మృతికి సంతాపంగా శనివారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో సిపిఐ ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. తొలిత సురవరం మృతికి సంతాప సూచికంగా పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న అరుణ పతాకాన్ని అవతనం చేశారు. అనంతరం సురవరం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.