అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని హజరత్ బీబీ జైనబ్బీ దర్గా ఉరుసు సందర్భంగా విద్యుత్ దీప కాంతులతో విరాజుల్లుతుంది. గురువారం రాత్రి తీసిన డ్రోన్ కెమెరా వీడియో ఆకట్టుకుని కనువిందు చేస్తోంది. అపురూప శిల్పకళలు అయినా జన్నత్ కా దర్వాజా, ఖాజా బందేనా వాజ్, ఖాజ గరీబ్ నవాజ్ దర్గా తరహా శిల్పకళలకు వేసిన విద్యుత్ దీప కాంతుల డ్రోన్ కెమెరా వీడియోలు ఆహుతులను కట్టిపడేసాయి. మూడు రోజులపాటు జరిగే ఉరుసు కార్యక్రమం శుక్రవారంతో ముగియనున్నాయి.