కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని గ్రానైట్ అసోషియేషన్ నాయకులకు గురువారం ఝలక్ ఇచ్చారు.20 ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారులంతా బీఆర్ఎస్ కు దోచిపెడుతూనే ఉన్నారని, ఇంకెన్నాళ్లు దోచిపెడతారని ప్రశ్నించారు. సభ్యత్వం పేరుతో గ్రానైట్ అసోసియేషన్ రూ.10 లక్షల నుండి రూ.50 లక్షలదాకా వసూలు చేసిందని, ఆ సొమ్మును ఏం చేశారని చెప్పాలన్నారు. వెయ్యి కోట్లు తీసుకున్నట్లు నాపై కొందరు దుష్ప్రచారం చేస్తూ నిందలేసినా ఖండించలేదని అన్నారు.