వేల్పూర్ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో చెరువులు, కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన కారణంగా విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు, చెక్‌డ్యాంలు నిండిపోయాయి. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మండలంలోని పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.