అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలో గల బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట వద్ద వైఎస్ఆర్సిపి శ్రేణులు ఆందోళన చేపట్టాయి. విజయరామరాజుపేట వద్ద గల తాచేరు పై ఉన్న కాజ్వే కొట్టుకుపోవడంతో ఇటు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కాజ్వే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సిపి శ్రేణుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తక్షణమే మరమ్మతు పనులు ,నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.