శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని లేపాక్షి దుర్గా పాప నాసేశ్వర వీరభద్ర స్వామి దేవాలయమును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మరియు అనంతపురం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ ఆలయాన్ని సందర్శించారు.ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి MH.నరసింహమూర్తి ఆలయ మర్యాదలతో సత్కరించినారు ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి జిల్లా అదనపు జడ్జ్ K శైలజ, పెనుకొండ ఆర్డిఓ ఆనంద్ కుమార్, తహశీల్దారు సౌజన్య లక్ష్మి, హిందూపురం రూరల్ సీఐ K.జనార్ధన్ పాల్గొన్నారు.