గ్రేటర్ వరంగల్ ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నగరంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి గుమ్మడి జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి గ్రేటర్ వరంగల్ వ్యవస్థాపక అధ్యక్షుడు రంగు సదానందం గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు భూపతి హరిబాబు పాల్గొన్నారు. సందర్భంగా ముఖ్య అతిధులు నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ ప్రమాణం చేయించారు.