అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం ఉమ్మలాడలో పాల్పడుతున్న భూ ఆక్రమణలు, ఇసుక దందాను అడ్డుకోవడంతో తనపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు అదే గ్రామానికి చెందిన దళిత నాయకుడు కంకణాల శ్రీనివాసరావు ఆరోపించారు. ఉమ్మలాడ గ్రామంలో కుళాయి పనుల వద్ద తలెత్తిన ఘర్షణలో ఉమ్మలాడ సర్పంచి సూరిశెట్టి గంగాయమ్మ కుమారులు సూరిబాబు, రామకృష్ణ తన తలపై ఇనుపరాడ్డుతో కొట్టారని ఆరోపించారు. ఘర్షణకు పాల్పడి, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్టు ఎస్సై ప్రసాదరావు తెలిపారు.