అనకాపల్లి జిల్లా వి.మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోగల దేవరాపల్లి రైతు సేవా కేంద్రం వద్ద ఎరువుల కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. ఎరువులు ఇచ్చేందుకు 1-బి, ఆధార్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను లైన్లో ఉన్న తర్వాత చెప్పడంతో రైతులు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. పోలీసు బందోబస్తు మధ్య ఎరువుల సరఫరా జరుగుతుంది. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.