నర్సాపూర్ నియోజకవర్గ నర్సాపూర్ మండలాల్లోని కాసాల దౌల్తాబాద్ నర్సాపూర్ ఆయా గ్రామాల్లోని వినాయక మండపాల వద్ద ఆదివారం భజన పాటలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కలు తీర్చుకున్నారు. వినాయక మండపాల వద్ద భజన పాటలు నిర్వహిస్తుండడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.