90 శాతం పైగా ఉన్న బహుజనుల రాజ్యాధికారం దక్కించుకోవడం కోసమే లక్ష్యంగా పని చేయాలని ప్రొఫెసర్ కేఎస్ చలం పిలుపునిచ్చారు. గ్రీన్ పార్క్ హోటల్ దగ్గర జ్యోతిరావు పూలే సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాల వద్ద శనివారం ఉదయం జూలూరు గౌరీ శంకర్ రాసిన బహుజన జనగణ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విశాఖ నగరం దిగంబర సాహిత్యానికి ప్రముఖ స్థానం ఉందన్నారు తాపీ ధర్మారావు లాంటివారు వ్రతం ఆవిర్భావ సమయంలో మేధావులారా మీరు ఎటువైపు అని ప్రశ్నించిన సందర్భం ఉందని గుర్తు చేశారు ఇప్పుడు కూడా బీసీలరా మీరు ఎటువైపు మనువాదం వైప బహుజన రాజ్యాధికారం ప్రశ్నించే సందర్భం వచ్చింది అన్నారు.