కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కెపల్లి లో యూరియా కోసం మహిళా రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. విశాల పరపతి సహకార సంఘం వద్ద కు యూరియా వస్తుందని సమాచారం మేరకు గ్రామంలోని రైతులతో పాటు మహిళా రైతుల కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు కూడా సహకార సంఘం వద్దకు చేరుకొని మధ్యాహ్నం వరకు చెప్పులు క్యూ లైన్ లో పెట్టారు. తమ వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు కూడా క్యూ లైన్ లో పెట్టారు. సాయంత్రం వరకు యూరియా రాకపోవడంతో రోడ్డుపై చేరుకొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పోలీసులు చేరుకొని రైతులతో మాట్లాడి పంపించారు.