నా మీద రాసిన వార్త నిరూపించక పోతే, క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో కోర్ట్ లో కేసు వేస్తానని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, సాలూరు ఎంఎల్ఎ గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. మేరకు సోమవారం టిడిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2 రోజుల క్రితం నా మీద దారుణంగా న్యూస్ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి తన కులం శాఖకి మంత్రిని అయ్యానన్నారు. విజయవాడలో మా ఇంటి శుభకార్యం తిరుపతిలో చిందులని అంటారా అని మండిపడ్డారు. సైకో జగన్ ని అంటిపెట్టుకుని ఉన్న మీడియా ఈ ప్రయత్నం చేస్తుందని,అన్నారు