గణేష్ నిమజ్జనం సందర్భంగా ఊరేగింపులో మృతి చెందిన ఘటనపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదివారం రాత్రి 10:30కు మీడియాతో మాట్లాడారు. ఉదయాన్నే పోస్టుమార్టం చేసి బాడీలను అప్పజెప్పాలని ఆసుపత్రి సూపర్డెంట్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక సహాయం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.