సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శనివారం ఫర్టిలైజర్ కేంద్రాల రైతులు బారులు తీరారు. తమకు సరిపడా యూరియా దొరకకపోవడంతో గంటలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధిత రైతులు వాపోయారు. అధికారులు స్పందించి సరిపడా యూరియా ఏర్పాటు చేయాలని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.