కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లో వివిధ గ్రామాలలోని వినాయక మండపాలను సందర్శించినట్లు మండల ఎస్ ఐ సాయి కృష్ణ బుధవారం తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులతో మాట్లాడారు. మండలంలో నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, నిమర్జనానికి వెళ్లేటప్పుడు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాలలో శాంతిభద్రతలు తలెత్తే విధంగా చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.