సైబరాబాద్లో సంచలన దోపిడీ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ వ్యాపారి సిబ్బందిని టార్గెట్ చేసి శంకర్పల్లిలో రూ.40 లక్షలు దోపిడీ చేసిన గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ మధుతో కలిసి మొత్తం ఏడుగురు ఈ దోపిడీ ప్లాన్లో భాగమని పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి రూ.17.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.