మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలోని ఆంధ్రరత్న ఎత్తిపోతల పథకానికి రూ.8.5 లక్షలతో మరమ్మతులు గురువారం చేయించారు. తుప్పుపట్టిన 150 హెచ్పీ మోటార్లకు మరమ్మతులు చేపట్టారు. మంత్రి ఆదేశాలతో స్థానిక కూటమి నాయకులు గురువారం నూతన మోటార్లను ప్రారంభించి సాగునీటిని విడుదల చేశారు.దీనితో రైతులు, స్థానికులు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.