అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని అరవకూరు, కూడేరు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతులకు మండల వ్యవసాయ అధికారి జి సుభాకర్ పొలం పిలుస్తుంది కార్యక్రమంతో బుధవారం వివిధ పంటలను పరిశీలించి సస్యరక్షణ చర్యలను వివరిస్తూ సాంకేతిక సలహాలు సూచనలను అందించారు. ఆయా గ్రామాల్లో రైతులతో మాట్లాడుతూ ఎరువుల వాడకం పురుగుల మందు వినియోగం వ్యాధి నివారణ చర్యలు పంటల బీమా అన్నదాత సుఖీభవ తదితర అంశాలపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది ముత్యాలన్న నరేష్ లక్ష్మీదేవి గ్రామ పెద్దలు రైతులు తదితరులు పాల్గొన్నారు.