ఈరోజు సాయంత్రం 07.22 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం 43.00 అడుగులకు చేరుకున్నది . ప్రస్తుతం 9,32,288 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక (1st Warning) జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.గోదావరి నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.