హుజూరాబాద్ పట్టణం లో ఎన్నడు లేని విధం గా కుండపోత వర్షం కురిసి పట్టణమంతా అతలాకుతలం అయిన నేపథ్యం లో ముంపు కు గురైన కాలనీల్లో మామిండ్లవాడ, గాంధీనగర్, ఇందిరానగర్, రెడ్డి కాలనీలో శుక్రవారం సాయంత్రం అధికారులతో పాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పర్యటించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి కురిసిన వర్షానికి చాలా మంది ఇండ్లలో నీళ్లు వచ్చి ఇబ్బందులు పడ్డారని ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి వారికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని ప్రభుత్వం వెంటనే బాధితులకు నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.