రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ పండుగ నేపథ్యంలో శాంతి కమిటీ సభ్యులతో, ఏర్పాట్లపై అధికారులతో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మున్సిపల్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో నగరంలో లో-లెవెల్ లో ఉన్న విద్యుత్ తీగలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గణేష్ నిమజ్జనానికి వెళ్లే రూట్లలో విద్యుత్ తీగల విషయంలో ఆ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లైటింగ్, శానిటేషన్ మున్సిపల్ శాఖ చూడాలన్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి.