పిచ్చి కుక్క దాడిలో పలువురు తీవ్రంగా గాయపడిన ఘటన బోధన్ మండలం బెల్లాల్లో చోటు చేసుకుంది. గురువారం ఓ వీధిలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసి పలువురిపై దాడి చేసింది. ఓ వ్యక్తితో పాటు మరో బాలునిపై దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గ్రామంలో కుక్కల బెడదతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.