మహబూబాబాద్ పట్టణంలో రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేశామని టౌన్ సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. సిఐ మాట్లాడుతూ.. ఈనెల 23న బయ్యారంకు చెందిన రమేష్ అనే వ్యక్తి తనకు పరిచయం ఉన్న మహబూబాబాద్ సిపిఐ కాలనీకి చెందిన మహిళను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని కురవికి తీసుకెళ్తుండగా వారు ఇరువురికి వాగ్ వివాదం జరగడం వల్ల తాను నడుపుతున్న బండిని అతివేగంగా నడపడం వల్ల మహిళ కిందపడి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిన్న మృతి చెందిందని అన్నారు.మృతికి కారణమైన నిందితుడిని ఈరోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు.