గుంటూరు నగరంలోని ఈనెల 31, సెప్టెంబర్ 1, 2తేదీల్లో పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. గుంటూరులో కమిషనర్ శ్రీనివాసులు శుక్రవారం మాట్లాడుతూ నెహ్రూనగర్ వద్ద పైప్లాన్, సంజీవయ్య నగర్లో ఇంటర్కనెక్షన్ పనులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. స్తంభాలగరువు, గుజ్జనగుండ్ల, ఏటీ అగ్రహారం, కేవీపీ కాలనీ, వికాస్నగర్, శ్యామలానగర్, హనుమయ్య నగర్, నెహ్రూనగర్, రాజీవ్ గాంధీనగర్, బొంగరాలబీడు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు.