కడపలో జరిగిన బ్రాహ్మణ సమ్మేళనంలో పేద బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. తల్లికి వందనం, ఇళ్ల స్థలాల వంటి పథకాల లబ్దిదారుల సమస్యలను అధికారులకు తెలియజేయాలని సూచించారు. రాజకీయాల్లో బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రసాదరావు, రఘునాథరావు, చంద్రమౌళి, గోపాలకృష్ణ, అనంతకుమారి పాల్గొన్నారు. పేద బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు