నిజామాబాద్ నగరంలో రోడ్లపై ఉన్న మట్టిని ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. నగరంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఇటీవల కేబుల్ వైర్ల కోసం రోడ్లను తవ్వి, మట్టిని వదిలేసారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ఆదేశాల మేరకు సీఐ ప్రసాద్, కానిస్టేబుల్ లతో కలిసి రోడ్లపై ఉన్న మట్టిని తొలగించారు. ట్రాఫిక్ పోలీసుల మంచితనానికి నగర ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు