లింగంపేట్ మండల శిక్షణ తరగతులు మండల కేంద్రం లోని GLR గార్డెన్ లో అన్ని గ్రామాల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు అందరికీ శిక్షణ కార్యక్రమము జరిగింది,ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు సాయిరెడ్డి ఆద్యక్షతన జరిగింది. జిల్లా అధ్యక్షులు పైడి విట్టల్ రెడ్డి మాట్లాడుతూ..గ్రామ కమిటీలు సమావేశాలు వారం వారం తప్పకుండా జరపాలి, పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటేనేనని పార్టీలకతీతంగా కులమత వర్గాలకతీతంగా రైతు సమస్యల కోసం అన్ని గ్రామాల్లో ఎక్కడికక్కడ కార్యకర్తలు చైతన్యవంతులై పోరాడుదాం అని ఈ సందర్భంగా పలువురు అధ్యక్షులు, కార్యకర్తలు కార్యక్రమంలో మాట్లాడారు.