అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ లో రాజీకి అనువైన 186 కేసులు పరిష్కరించినట్లు ఇన్ఛార్జ్ జడ్జి జే.కీర్తన తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం సభ్యులు కక్షిదారులు పాల్గొన్నారు.