సూర్యాపేట జిల్లా, కోదాడ పట్టణంలోని ఎస్టీ హాస్టల్ ను కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు హాస్టల్ పరిసరాలను పరిశీలించి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున పరిశుభ్రంగా పరిసరాలను ఉంచుకోవాలని సూచించారు. వంట వార్పులో శుభ్రత పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వారి వెంట హాస్టల్ వార్డెన్ వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.